తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) జైలర్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. ఇప్పటికే రజినీ ‘వెట్టయ్యాన్’ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
70 %కి పైగా ఈ సినిమా కంప్లీట్ కూడా చేసుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ (lokesh kanagaraj)తో తలైవా 171 (Thalaivar 171) ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఇక ఖైదీ, విక్రమ్, లియో లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన లోకేశ్ కనగరాజ్ – రజినీకాంత్ కాంబోలో సినిమా రాబోతుండడంతో ఎలా ఉండబోతుందోనని అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక ఇంటర్వ్యులో పాల్గోన్న లోకేష్.. తలైవా 171 గురించి మాట్లాడుతూ.. రజనీకాంత్‌తో కలసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తలైవా 171 నాకెంతో ప్రత్యేకమైనది. షూటింగ్ మొదలుపెట్టడానికి, ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది. జూన్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఏడాదిన్నరలో ఈ సినిమా పూర్తి చేసి ఆ తర్వాత ‘ఖైదీ 2’ మొదలుపెడతాను అంటూ లోకేష్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.