top of page
Shiva YT

బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ స్మార్ట్ ఫోన్‌లో 5 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తున్నారు. స్క్రీన్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా5 ప్రొటెక్షన్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ర్యామ్‌ ప్లస్ ఫీచర్‌తో ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు.

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో నాక్‌ సెక్యూరిటీని అందించారు. సామ్‌సంగ్‌ వ్యాలెట్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. మెమోరీ కార్డుతో 1 టీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఫోన్‌ కంటిన్యూగా వాడినా ఒటికన్నర రోజులు వస్తుందని చెబుతోంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్లూటూత్‌ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. ఇందులో ప్రత్యేకంగా వాయిస్‌ ఫోకస్‌ మోడ్‌ను అందించారు. దీంతో నాయిస్‌ లెస్‌ కాల్స్‌ను పొందొచ్చు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,000కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,000గా నిర్ణయించారు.

bottom of page