top of page
MediaFx

ప్ర‌పంచ క్రికెట్‌లో లూకీ ఫెర్గూస‌న్ స‌రికొత్త రికార్డు 🌟🏏


ప్ర‌పంచ క్రికెట్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌రల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో సరికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఫెర్గూస‌న్ 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌కుండా 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేశాడు. అంతేగాక 3 వికెట్లు కూడా తీశాడు.ఇంతకుముందు కెన‌డాకు చెందిన సాద్ బిన్ జ‌ఫ‌ర్ 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీసాడు కానీ ఫెర్గూస‌న్ అత‌నిని మించిపోయాడు. పాపువా న్యూ గినియాతో జ‌రిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఫెర్గూస‌న్ ఘోరంగా దెబ్బతీశాడంటే పీఎన్‌జీ 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అయితే, ఈ రెండు జ‌ట్లు ఇప్పటికే టీ20 వ‌రల్డ్‌క‌ప్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ విజ‌యంతో గ్రూప్‌-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో త‌న ప్ర‌స్థానాన్ని ముగించింది.


bottom of page