top of page

‘మ్యాడ్’ మూవీ రివ్యూ..నాన్ స్టాప్ ఫన్ రైడ్..

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్‌తో పాటు సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ నాగవంశీ నిర్మించిన యూత్ ఫుల్ కామెడీ సినిమా మ్యాడ్. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. నిజంగానే మ్యాడ్ పుట్టించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.

నా సినిమా చూస్తూ కాసేపు నవ్వకుండా ఉండగలిగితే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తా.. ఓ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేశాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కానీ ఓన్లీ కాన్ఫిడెన్స్.. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ అని సినిమా చూసిన తర్వాత అర్థమైంది. కాలేజ్ కామెడీ డ్రామాస్ తెలుగులో చాలా వచ్చాయి కానీ.. MAD వాటన్నింటికీ బాబు లాంటి సినిమా. ఎక్కడ మొదలుపెట్టాలి.. దేని గురించి చెప్పాలి.. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా పంచుల వర్షం కురిపించాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. రొటీన్ స్టోరీకి ఇంతకంటే రేసీ స్క్రీన్ ప్లే మరొకటి ఉండదు. ఒక సీన్ చూసి నవ్వుకునే లోపు మరో అదిరిపోయే సీన్ వచ్చింది. ఫస్టాఫ్, సెకండ్ హాఫ్ కాదు థర్డ్ హాఫ్ పెట్టినా చూసేట్లు తీసారు దర్శకుడు కళ్యాణ్. ఎప్పుడు మొదలై ఎప్పుడు అయిపోయిందో తెలియనంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది మ్యాడ్. తమ పిచ్చి పనులతో పిచ్చపిచ్చగా నవ్వించారు మ్యాడ్ టీమ్. సింగిల్ లైనర్స్ అయితే అన్ స్టాపబుల్. ముగ్గురు హీరోలు అదరగొట్టారు. లాజిక్ లేకుండా చూస్తే సినిమా కడుపులు చెక్కలైపోయేలా నవ్విస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. సినిమా చూస్తుంటే చాలాసార్లు నాకు కాలేజ్ రోజులు గుర్తొస్తాయి.ఓవరాల్ గా మ్యాడ్.. రెండు గంటల నాన్ స్టాప్ ఫన్ రైడ్.. జస్ట్ గో అండ్ ఎంజాయ్


 
 
bottom of page