top of page
MediaFx

టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ సీక్వెల్ వచ్చేస్తోంది..


టిల్లూ స్క్వేర్ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నారు సితార ఎంటర్‌టైన్మెంట్స్ మూవీ మేకర్స్ . ఇప్పుడదే ఊపులో మరో సినిమా సీక్వెల్ అనౌన్స్ చేశారు. టైటిల్ కలిసి రావడంతో ఈ కొత్త సీక్వెల్ కు కూడా మ్యాడ్ స్క్వేర్ అనే పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గతేడాది అక్టోబర్ లో రిలీజైన మ్యాడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. టిల్లూ స్క్వేర్ లాగే మ్యాడ్ స్క్వేర్ కూడా మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. నిజానికి డీజే టిల్లూ రిలీజైన రెండేళ్లకు టిల్లూ స్క్వేర్ వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే టిల్లూ గాడు ఈసారి కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి రూ.130 కోట్ల వరకూ వసూలు చేశాడు. సిద్దూ జొన్నలగడ్డ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇదే మ్యాడ్ మూవీకి సీక్వెల్ తీసుకురావాలన్న ఆలోచనను మేకర్స్ కు కలిగించింది. ఈ సినిమా థియేటర్లతోపాటు తర్వాత ఓటీటీలోనూ సక్సెసైంది. ఈ మూవీలో నార్నె నితిన్, సంగీత్ శోభన్ నటించారు.


bottom of page