తెలుగు చిత్ర పరిశ్రమలో పక్కా కమర్షియల్ హీరోగా సాగుతూ.. రీజినల్ రికార్డులన్నీ తన హ్యాండోవర్‌లో ఉంచుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న అతడు.. తన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను బాగా పెంచుకుంటూనే ఉన్నాడు. 🎥
ఇలా ఇప్పుడు మహేశ్ బాబు 'గుంటూరు కారం' అనే మాస్ మూవీని చేస్తున్నాడు.సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న సినిమానే 'గుంటూరు కారం'. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంతో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు.🎥 ముఖ్యంగా ఈ చిత్రాన్ని మహేశ్ కెరీర్‌లోనే హై రేంజ్‌లో 🎥తెరకెక్కిస్తున్నారు.'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఏర్పడడంతో షూటింగ్ సజావుగా సాగడం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గుంటూరు కారం' మూవీకి సంబంధించి ఎన్నో రకాల అంశాలు లీక్ అవుతూనే ఉన్నాయి.🎥 ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి🎥 స్పెషల్ సాంగ్ గురించి న్యూస్ రివీల్ అయింది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో మాంచి మాస్ నెంబర్ ఉన్న ఐటెం సాంగ్‌ను పెట్టారట. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్యూన్స్‌ను థమన్ రెడీ చేశాడని తెలిసింది.'గుంటూరు కారం' మూవీలోని స్పెషల్ సాంగ్‌లో ఓ స్టార్ హీరోయిన్‌ను చూపించబోతున్నారని తెలిసింది. అయితే, ఆమె ఎవరు అనే దానిని మాత్రం సీక్రెట్‌గా ఉంచబోతున్నారట. సినిమాలోనే ఈ సర్‌ప్రైజ్ రివీల్ అయ్యేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆ హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు ఫిలిం నగర్ ఏరియాలో 🎥చక్కర్లు కొడుతున్నాయి.🎥