top of page
MediaFx

అంతర్జాతీయ స్థాయికి చేరిన మహేష్ మాస్ సాంగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ముందుగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడంతో సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు అదరగొట్టారు. మాస్ అవతార్ లో బాబు స్క్రీన్ మీద సందడి చేస్తుంటే ఫ్యాన్స్ కు ఈలలు గోలలతో దుమ్మురేపారు. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రాత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ఊపు ఊపేసింది ఈ సాంగ్.

ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. సినిమా వచ్చిన ఇన్ని నెలలైనా కూడా కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం వినిపిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ సొంతం చేసుకుంది. చాలా మంది సెలబ్రెటీలు కూడా ఈసాంగ్ కు స్టెప్పులేసి సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ సాంగ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. అమెరికా హూస్టన్ లో జరిగే నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లోనూ కుర్చీ మడతపెట్టి సాంగ్ మారుమ్రోగింది. ఈసాంగ్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ మోటార్ స్పోర్ట్ కంపెనీ ‘నిస్సాన్ మోటార్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్’ తన కొత్త కారును లాంచ్ చేసింది. తమ బ్రాండ్ న్యూ కారును లాంచ్ చేసి ఆ వీడియోకు కుర్చీ మడతపెట్టి సాంగ్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ వీడియో పై మహేష్ బాబు ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.



bottom of page