top of page
MediaFx

మ‌హేష్ – రాజ‌మౌళి…ఇదో కొత్త టైటిల్‌!


మ‌హేష్ బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర‌బృందం ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌లేదు. మ‌హేష్ ని మిన‌హాయిస్తే మిగిలిన కాస్టింగ్ గురించి ఏం చెప్ప‌లేదు. టైటిల్ అంటారా … స‌రే స‌రి. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అనే విష‌యంలోనూ క్లారిటీ లేదు. కాక‌పోతే ఆగ‌స్టు 9 మ‌హేష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వస్తుందేమో అని మ‌హేష్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త లేదు. రాజ‌మౌళి మ‌హేష్ బ‌ర్త్ డే కోసం ప్ర‌త్యేక‌మైన ప్లాన్స్ చేస్తున్న‌ట్టు ఏం క‌నిపించ‌డం లేదు. కాస్త ఆల‌స్య‌మైనా అభిమానుల్ని అల‌రించే అప్‌డేట్ తో రావాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకు ‘గోల్డ్‌’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార్ట‌. ‘గోల్డ్‌’ అనేది యూనివ‌ర్స‌ల్ టైటిల్. అందుకే చిత్ర‌బృందం ఈ టైటిల్ కే మొగ్గు చూపే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రారంభానికి ముందే ఓ ప్ర‌త్యేక‌మైన గ్లింప్స్ విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ గ్లింప్స్ లో ఇత‌ర న‌టీన‌టుల‌కు సంబంధించిన వివ‌రాలూ ప్ర‌క‌టిస్తార‌ని స‌మాచారం. అదే రోజున టైటిల్ ప్ర‌క‌టిస్తారా, లేదంటే… ఇది వ‌ర్కింగ్ టైటిల్ గా అనుకొంటున్నారా? అనే సంగ‌తులు తెలియాల్సివుంది. ప్ర‌స్తుతానికైతే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్టు ప‌నులు పూర్తి చేశారు. త్వ‌ర‌లోనే రాజ‌మౌళి ఓ వ‌ర్క్ షాప్ నిర్వ‌హిస్తారు. ఆ త‌ర‌వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర‌తినాయ‌కుడిగా విక్ర‌మ్ న‌టిస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కూడా ఓ స్ప‌ష్ట‌త రావాల్సివుంది.




bottom of page