top of page
MediaFx

నాన్ పాన్ ఇండియా మూవీస్ లో మహేష్ బాబు సరికొత్త రికార్డ్ 💪🏽🔥


సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది ఫ్లాపైంది. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ సినిమా చేయబోతున్నాడు. రాజమౌళికి, మహేష్ బాబుకు ఇద్దరికీ ఇది తొలి పాన్ వరల్డ్ మూవీ కాబోతోంది. మహేష్ బాబు మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తారంటూ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దీన్ని అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. రూ.1500 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు బడ్జెట్ అవుతుందనే అంచనాలున్నాయి. ఇండియా బయట కూడా పలు భాషల్లో విడుదల చేయాలనే యోచనలో రాజమౌళి ఉన్నారు.

తన చివరి ఐదు సినిమాలతో మహేష్ బాబు నాన్ పాన్ ఇండియా కేటగిరిలో కొత్త రికార్డ్ సృష్టించారు. ఏ హీరో దీన్ని సాధించలేకపోయారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమా ఫ్లాపైనప్పటికీ రూ.111.81 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాకు ముందు పరశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారువారి పాట సినిమా కూడా విజయం సాధించలేదు. మహేష్ బాబు పేరుమీద యావరేజ్ గా నిలిచింది. రూ.110.12 కోట్ల షేర్ రాబట్టింది. దీనికి ముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా రూ.138.78 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు ముందు వచ్చిన వంశీ పైడిపల్లి చిత్రం మహర్షి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు షేర్ రూ.104.58 కోట్లు వచ్చింది. మహర్షికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా కూడా రూ.101 కోట్ల షేర్ సాధించింది. చివరి ఐదు సినిమాలతో మహేష్ బాబు రూ.566.29 కోట్ల షేర్ సాధించారు. పాన్ ఇండియా సినిమాలు కాపోయినప్పటికీ ఆ రేంజ్ లో షేర్ వసూలుచేయడం అనేది నాన్ పాన్ ఇండియా కేటగిరిలో సరికొత్త రికార్డు అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. మహేష్ బాబు ఒక్కడివల్లే సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఎవరూ అందుకోలేరంటున్నారు.

bottom of page