సినీ పరిశ్రమలో ఎప్పుడూ హీరోల హవా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే టాప్ డైరెక్టర్ల హవా కూడా కొనసాగుతుంటుంది. గతంలో దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి.. ఇలా వారు చెప్పినట్లు హీరోలు నటించేవారు. ఎవరూ ఎదురు ప్రశ్నించేవారే కాదు. ప్రస్తుతం పరిశ్రమలో డైరెక్టర్లకన్నా హీరోల హవానే ఎక్కువగా కొనసాగుతోంది. అయితే వీరికి సమాంతరంగా టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ కూడా ఆ కోవలోకే వస్తారు. కేజీఎఫ్ సిరీస్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. దీనితర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ వరల్డ్ మూవీగా రూపుదిద్దుకుంటోంది. బడ్జెట్ దాదాపు రూ.వెయ్యి కోట్లుగా ఉండబోతోంది. ఈ సినిమా చేయడానికి మహేష్ బాబుకు ఎంతలేదన్నా కనీసం రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల సమయం పడుతుంది.
ఈలోగా ప్రశాంత్ నీల్ సలార్2 తోపాటు ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా పూర్తిచేస్తాడు. ఆ సమయానికి మహేష్ సినిమా పూర్తికాగానే వెంటనే షూటింగ్ ప్రారంభించేయవచ్చు అనే ఆలోచనలో ఈ డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబును కలిసి ప్రశాంత్ నీల్ ఓ లైను వినిపించినట్లు తెలుస్తోంది. అది బాగా నచ్చిన మహేష్ బాబు స్క్రిప్ట్ ను రెడీచేయమని కోరినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా సిద్ధమైతే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్నట్లే. ప్రశాంత్ నీల్ మాత్రం వెంటవెంటనే సినిమాలు చేస్తూ సక్సెస్ ను అందుకుంటున్నాడు. మహేష్ బాబు మాత్రం ప్రస్తుతానికి రాజమౌళి సినిమా మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. దీనికోసం తన మేకోవర్ ను కూడా మార్చుకుంటున్నారు. ఆగస్టులో లేదంటే సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిర్మాత డాక్టర్ కె.ఎల్.నారాయణ వెల్లడించారు.