మహేష్ ఖాతాలో మరో రికార్డ్ తో కుర్చీ మడత పెట్టి..
- MediaFx
- Jun 10, 2024
- 1 min read
మహేష్ బాబు తాజా చిత్రం "గుంటూరు కారం," త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, శ్రీలీల నటిస్తూ, భారీ విజయాన్ని సాదించింది. మిక్స్డ్ రివ్యూస్ తో కూడా చిత్రం రీజనల్ గా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో థమన్ కంపోజ్ చేసిన సెన్సేషనల్ హిట్ "కుర్చీ మడత పెట్టి" పాట హైలైట్ అయ్యింది.ఈ పాట వచ్చాక అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ అందుకుని, 100 మిలియన్ నుండి 200 మిలియన్ వ్యూస్ వరకు తెలుగులో ఫాస్టెస్ట్ గా చేరిన పాటల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల, 2 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసి మహేష్ ఖాతాలో ఇంకో రికార్డ్ అందించింది. ఇప్పుడు 300 మిలియన్ వ్యూస్ దిశగా దూసుకెళ్తూ అన్ స్టాప్పబుల్ గా ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ తదితరులు నటించగా, హారిక హాసిని వారు నిర్మాణం వహించారు.