సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఓ భారీ హిట్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి కానీ ఆవి ఫ్యాన్స్ కు అంతగా కిక్ ఇవ్వలేకపోతున్నాయి. దాంతో ఒక్క సాలిడ్ హిట్ పడాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. గుంటూరు కారం సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు మద్దతుగా నిలిచారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ భారీగా పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని అన్నారు. ఇప్పటికే కథ పూర్తయ్యిందని.. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయని అన్నారు.
ఇక ఈ సినిమా గురించి త్వరలోనే ఓ కాన్సెప్ట్ వీడియో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మహేష్ కనిపిస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్స్ లో ఉన్నారు. విదేశాల్లో ఉన్న మహేష్ ప్రస్తుతం స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలోనే మహేష్ ఇండియాకు తిరిగి రానున్నారు. మరి రాజమౌళి మహేష్ బాబు సినిమాతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.🎥✨