top of page
MediaFx

రిలీజ్‌కి ముందు అంటున్న మేకర్స్..

మ్యాడ్ సినిమా దర్శక నిర్మాతలు. కళ్లాజోడు కాలేజ్ పాప చూడు అంటూ సాగే పాటను విడుదల చేసి.. సినిమాకు ఫుల్ ప్రమోషన్ తెచ్చుకున్నారు. ఆ సాంగ్ తర్వాతే మ్యాడ్‌పై మరింత ఆసక్తి పెరిగింది. మ్యాడ్ ట్రైలర్, టీజర్ కంటే కళ్ళాజోడు వీడియో సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ నెక్ట్స్ లెవల్ అంతే.

దసరాకు కూడా రిలీజ్‌కు ముందే ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ విడుదల చేసారు. పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా అవే ఫాలో అయ్యారు మేకర్స్. ఈ సాంగ్ భారీ వ్యూస్ తో యూట్యూబ్ ను షాక్ చేసింది. ఇప్పటికి ట్రేండింగ్ లో ఉంది.

ఆ మధ్య నితిన్ మాచర్ల నియోజకవర్గంలోని వీడియో సాంగ్ ఇలాగే విడుదల చేసారు. ఏదేమైనా ఈ ఫార్ములా కొన్ని సినిమాలకు బాగానే వర్కవుట్ అవుతుంది. ఇంకా చూడాలి తర్వాత ఈ సినిమా నిర్మాతలు ఈ ఫార్ములాను వాడనున్నారో.


bottom of page