సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. 💑
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో ఒకటి జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. 50 ఏళ్ల వయస్సులో కూడా హాట్‌గా ఎలా కనిపించాలో మలైకా అరోరాను చూసే నేర్చుకోవాలి. అందాల ఆరబోతకు మలైకా అరోరా పెట్టింది పేరు.సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అతనితో ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆ తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో భర్త అర్బాజ్ ఖాన్‌కు మలైకా విడాకులిచ్చింది. ప్రస్తుతం తనకంటే 12 సంవత్సరాల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే ఈ భామ కొడుకు అర్హాన్ ఖాన్‌తో కలిసి వోడ్‌కాస్ట్ 'డంబ్ బిర్యానీ'లో సందడి చేసింది. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో మలైకా నీవు కన్యత్వం ఎప్పుడు కోల్పోయావని తన కొడుకుని ప్రశ్నించింది. ఊహించని ప్రశ్నతో ఒక్కసారిగా షాకైన అర్హాన్ నువ్వు సోషల్ క్లైంబర్‌వా అని అడుగుతాడు. మలైకా కొడుకు సమాధానం కోసం పట్టుబట్టింది. అయితే ఇదే వేదికపై తల్లి మలైకా వివాహం గురించి అర్హాన్ ప్రశ్నిస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. 🎬📺