తాజాగా మలయాళంలో రిలీజ్ అయి సంచలన విజయం అందుకున్న యూత్ఫుల్ లవ్ స్టోరీ మూవీ ప్రేమలు. మలయాళీ నటీనటులు నస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ మూవీకి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించగా విష్ణు విజయ్ సంగీతం సమకూర్చారు.ఇక ఈ మూవీని తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, తాజాగా ప్రేమలు మూవీ ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ లవ్ స్టోరీని మిస్ అయిన వారు ఇప్పుడు తెలుగు వర్షన్ ని ఆహాలో చూసేయొచ్చు. అలానే మరొక ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తమిళ్, మలయాళం, హిందీ వెర్షన్స్ ఈ మూవీ అందుబాటులో ఉంది.🎥✨