top of page
MediaFx

మాల్దీవుల్లో ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం


గాజాపై దాడుల నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వం ఇజ్రాయెల్ పౌరులను తమ దేశంలోకి అనుమతించకుండా నిషేధం విధించేందుకు సిద్ధమైంది. చట్టంలో మార్పులు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం స్థానికుల పిలుపు మేరకు తీసుకున్నామని హోమ్‌లాండ్ సెక్యూరిటీ, టెక్నాలజీ శాఖ మంత్రి అలీ ఇసుహాన్ తెలిపారు. నిషేధం వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శిస్తుండగా, అందులో 15,000 మంది ఇజ్రాయెలీ పౌరులే అని స్థానిక మీడియా తెలిపింది.


bottom of page