top of page
Suresh D

మమ్ముట్టి నటిస్తున్న 'భ్రమయుగం' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ ..🎥🎞️

అటు మలయాళం, తమిళతో పాటు తెలుగులోనూ చాలా మంది ప్రేక్షకులు మమ్ముట్టిని ఇష్టపడుతుంటారు. అయితే నిన్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పుట్టినరోజు . సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మమ్ముట్టి నటిస్తున్న కొత్త చిత్రం 'భ్రమయుగం' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మమ్ముట్టి లుక్ అదిరిపోయింది. 60 ఏళ్ల ముసలి వ్యక్తి పాత్రలో ఆయన కనిపించారు. 🎥🎞️


bottom of page