మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ నెల 15న రిలీజ్ అయిన భ్రమయుగం సినిమాకి పాజిటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి. 🎬
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన హారర్ సినిమా 'భ్రమయుగం' బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తుంది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ఆడియన్స్ వరకూ సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అందులోనూ మమ్ముట్టి అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. 'భూతకాలం' తీసిన రాహుల్ సదాశివన్ ఈ సినిమాను తెరకెక్కాడు. 🌟
భ్రమయుగం విడుదలకు ముందే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. ఇక రిలీజైన తర్వాత బలమైన మౌత్ టాక్ రావడంతో ఈ చిత్రం కేరళ బాక్సాఫీస్ నుంచి తొలిరోజు రూ.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మలయాళ సినిమాలకు మంచి జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) మార్కెట్ ఉండటంతో గల్ఫ్ దేశాల్లోను భ్రమయుగం సత్తా చాటింది. అక్కడ తొలి రోజు రూ.3.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. టోటల్‌గా డే వన్ కలెక్షన్స్ రూ.7.6 కోట్లు కావడం విశేషం.
టాక్ బాగుండడంతో రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. చక్రవర్తి రామచంద్, ఎస్ శశికాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ అశోక్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్, మణికందన్ ఆర్ ఆచారి ప్రముఖ పాత్రలు పోషించారు. 🎥
కేవలం మూడు పాత్రలతో రెండున్నర గంటల పాటు ఈ సినిమాను నడిపించారు. అందులోనూ ఈ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో సినిమా తీసి పెద్ద సాహసం చేశారు మమ్ముట్టి. ఇక స్టార్ హీరో హోదాను పక్కన పెట్టి ఇలాంటి పాత్రను మమ్ముట్టి చేయడం చూసి ఆడియన్స్ కూడా అవాక్కయ్యారు. సినిమా మొత్తం ఒక్కటే కాస్ట్యూమ్‌లో కనిపించారు మమ్ముట్టి.టెక్నికల్‌గా సినిమా చాలా బ్రిలియంట్‌గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే మమ్ముట్టి ఇందులో నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా ఎక్కడా మమ్ముట్టి కనిపించకుండా కేవలం చేసిన పాత్రే కనిపించిందంటూ ఆడియన్స్ అంటున్నారు. ఇక ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లి థియేటర్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక ట్రాన్స్‌లోకి నెట్టేసింది భ్రమయుగం. ఇలా సినిమాకి ఎక్కడ చూసినా పాజిటివ్ బజ్‌యే ఉంది. ముఖ్యంగా మమ్ముట్టి నటన, పాత్రపై ఆడియన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. 73 ఏళ్ల వయసులో ఇంత వెరైటీ కాన్సెప్ట్‌లతో ఈ రేంజ్ యాక్టింగ్‌తో మమ్ముట్టి కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తానికి భ్రమయుగంతో మరో హిట్‌ను మమ్ముట్టి తన ఖాతాలో వేసుకున్నారు. 🎭