top of page
Suresh D

గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్..✨


టాలీవుడ్ మంచు వారి హీరో మంచు మనోజ్ ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి చాలా కాలం తర్వాత బ్రేక్ తీసుకొని ప్రొఫెషనల్ గా అలాగే పర్సనల్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని మళ్ళీ తాను బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

అలా కొన్ని సినిమాలతో పాటుగా తన పెళ్లి విషయంలో కూడా పలు శుభ వార్తలు అందించిన తాను గత కొంతకాలమే తన భార్య భూమా మౌనిక మంచు కలిసి తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా అనౌన్స్ చేసాడు.మరి ఇప్పుడు ఎట్టకేలకు వీరిద్దరూ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారినట్టుగా అనౌన్స్ చేసి ఈ శుభవార్తని అందరితో పంచుకున్నారు. అయితే తమ ఇంటికి వచ్చిన ఈ చిట్టి మహాలక్ష్మిని “ఎంఎం పులి” అంటూ అప్పుడే ఓ ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా తెలిపారు. మరి ఆ పరమశివుని ఆశీస్సులు అందరి ప్రేమ తమపై ఉండాలని కోరుకుంటూ ఈ శుభవార్తను మంచు వారి కుటుంబం ఇప్పుడు షేర్ చేశారు. దీనితో టాలీవుడ్ ప్రముఖులు మంచు వారి అభిమానులు ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.✨



bottom of page