top of page
MediaFx

తెలుగులో సన్నీ లియోన్ హార‌ర్ ట్విస్ట్


బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. స‌న్నీలియోన్ తెలుగు మూవీకి మందిర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. త‌ల‌పై కిరీటం ధ‌రించి రాజుల కాలం వ‌స్త్రాధార‌ణ‌లో రాణిగా స‌న్నీలియోన్ క‌నిపిస్తోంది. ఈ సినిమాలో స‌న్నీలియోన్ నెగెటివ్ షేడ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తోంది.మందిర సినిమాకు ఆర్ యువ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌న్నీ లియోన్ హీరోయిన్‌గా త‌మిళంలో 2022లో రిలీజైన ఓ మై ఘోస్ట్‌కు డ‌బ్ వెర్ష‌న్‌గా మందిర తెలుగులో రిలీజ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఓ మై ఘోస్ట్ మూవీలో స‌న్నీలియోన్‌తో పాటు స‌తీష్, ద‌ర్శ‌నా గుప్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. హార‌ర్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న‌ది.


bottom of page