top of page
Shiva YT

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా..

📅 గత కొంత కాలంగా వైసీపీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు రామకృష్ణా రెడ్డి. దీనికి కారణం అసంతృప్తి అని అంటున్నారు అతని వర్గీయులు. స్పీకర్ ఫార్మెట్లోనే రాజీనామా లేఖను తయారు చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం స్పీకర్ తమ్మినేని సీతారాం అందుబాటులో లేకపోవడంతో ఓఎస్డీ రామాచారికి రాజీనామా లేఖను అందించారు. ఆర్కే రాజీనామాతో నియోజకవర్గంలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈయన భవిష్యత్ కార్యచరణ ఏంటి అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం ఎమ్మెల్యే పదవికే కాకుండా పార్టీకి కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్కే సన్నిహిత వర్గం అలాంటిదేమీ లేదని తోసిపుచ్చుతున్నారు.

🏛️ అమరావతి విషయంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పలు కేసులు వేశారు. జగన్ కు సన్నిహితుడు అనే పేరు బలంగా ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో మంగళగిరి వైసీపీ ఇన్‎ఛార్జ్‎గా గంజి చిరంజీవిని నియమించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే గంజి చిరంజీవి కొద్ది నెలల క్రితమే వైసీపీలో చేరారు. ఈయన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. వైసీపీలో చేరిన వెంటనే ఆయనకు ఆప్కో చైర్మన్‎గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి.

🔮 ఇదే అదునుగా భావించిన చిరంజీవి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించి దూకుడు పెంచారు. ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులన్నింటినీ అవగతం చేసుకున్న ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో కొనసాగుతారా.. లేక గుడ్‎ బై చెబుతారా అన్న విషయం తెలియాల్సి ఉంది.

bottom of page