top of page
MediaFx

రుచిగా ఉంటాయని మామిడి అతిగా తింటున్నారా.?🥭🚫

సమ్మర్‌ వచ్చిందంటే మండె ఎండలతో పాటు టక్కున గుర్తొచ్చేది మామిడి పండ్లు. రుచిలో అద్భుతంగా ఉండే మామిడి పండ్లను తినేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక కేవలం రుచికి మాత్రమే పరిమితం కాకుండా మామిడి పండ్ల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే సమ్మర్‌లో మాత్రమే లభించే మామిడి పండ్లను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. అయితే అతి ఎప్పటికీ అనర్థమే అన్నట్లు మంచి చేసే మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మామిడి పండ్లను అధికంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* స్కిన్‌ ఎలర్జీలతో బాధపడే వారు మామిడి పండ్లను మితంగా తీసుకోవడమే మంచిది. మామిడి పండ్లను అతిగా తీసుకుంటే ఇలాంటి వారికి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చర్మంపై దురద ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* ఇక మామిడి పండ్లు ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను అతిగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, డరేయిరా వంటి సమస్యలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* మామిడి పండ్లలో గ్లూకోజ్‌ కంటే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీని వల్ల శరీరంలో అసమతుల్యతను సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక మామిడి పండ్లను అతిగా తీసుకుంటే శరీరంలో వేడి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పండ్లను తినే గంట ముందు నీటిలో నానబెట్టి తినాలని సూచిస్తున్నారు.

* మామిడి పండును భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన అరగంట తర్వాత తినడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల మన శరీరం అందులోని పోషకాలను గ్రహించేలా చేస్తుంది. అయితే తిన్న వెంటనే మామిడి పండ్లను తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

bottom of page