పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ కింగ్ నాగార్జున వంటి టాప్ స్టార్లతో యాక్ట్ చేసింది అన్షు. కెరీర్ మొత్తంలో చేసింది నాలుగు సినిమాలే అయినా ఎప్పటికీ ఈ బ్యూటీని ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మన్మథుడు, రాఘవేంద్ర సినిమాల్లో అన్షు కనిపించిన తీరు, నటించిన విధానం కుర్రాళ్లకి తెగ నచ్చేసింది. అందుకే ఇప్పటికీ ఈ హీరోయిన్ అంటే ఎంతోమందికి ఫేవరెట్. అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈ బ్యూటీ తాజాగా రీఎంట్రీకి రెడీ అవుతున్నట్లు సమాచారం.
సందీప్ కిషన్ హీరోగా ధమాకా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన ఇటీవల ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. SK30 వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అన్షును తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది. తన పాత్రకి సంబంధించిన నేరేషన్ కూడా పూర్తయిందట. అన్నీ కుదిరితే ఈ చిత్రంతో అన్షు కమ్ బ్యాక్ ఇవ్వబోతుంది. అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది ఈ బ్యూటీ.
ఇక మన్మథుడు సినిమాను ఇటీవల రీరిలీజ్ చేయగా ఆడియన్స్, ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో ఈ సినిమా గురించి తన పాత్ర గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది అన్షు. సినిమాల్లో నటించడానికి యూకే నుంచి ఇండియాకు వచ్చిన అన్షు.. లండన్ వ్యక్తినే పెళ్లాడి అక్కడికే వెళ్లిపోయింది.
హీరోయిన్‌గా కెరీర్ గ్రాఫ్ పైకి లేస్తుందన్న వేళ (2003లో) సచిన్ సగ్గర్‌ను ఆమె వివాహం చేసుకుంది. సినిమాలకు బైబై చెప్పి లండన్ వెళ్లిపోయారు. అన్షు ఫ్యాషన్ డిజైనర్ కావడంతో గార్మెంట్స్ బిజినెస్‌లో సెటిల్ అయిపోయింది. అన్షుకి ఇద్దరు పిల్లలు. మొదట కూతురు జన్మించగా తర్వాత ఓ బాబు పుట్టాడు. లండన్‌లో తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తోన్న అన్షు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. ఫంక్షన్లు, పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్లిన ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది.