top of page
MediaFx

విమానం కూలిన ఘటనలో ఊహించని మిరాకిల్‌.. తృటిలో తప్పించుకున్న వ్యక్తి..


గోల్ఫ్ కోర్స్ ఓపెన్ మరియు సురక్షితమైన ప్రదేశం కాబట్టి పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసాడు. ఈ ఘటనలో పైలట్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి ఇంధనం లీకైనప్పటికీ మంటలు చెలరేగకపోవడం విశేషం. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. విమానం ల్యాండింగ్ ప్రదేశం వేరే చోట ఉండి ఉంటే, ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. భూమిపై పడిన తర్వాత విమానం గోడను ఢీకొట్టి అక్కడే ఆగిపోయినట్లు బయటకు వచ్చిన వీడియోలో చూడవచ్చు. ఏదైనా నివాస ప్రాంతంలో పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

సంఘటన జరిగిన తర్వాత, మేము చప్పుడు విన్నామని, అయితే అది ఏమిటో మాకు తెలియదని గోల్ఫ్ కోర్స్ ఉద్యోగి చెప్పారు. ఇంతకు ముందు ఇలాంటి ప్రమాదం చూడలేదు. ఇది పిచ్చి పనిలా అనిపించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



bottom of page