top of page
MediaFx

పాపతో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక..

టాలీవుడ్‌ రాక్ స్టార్ మంచు మనోజ్‌, మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. శనివారం ( ఏప్రిల్‌ 13న) మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. ‘దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. మేం పాపను ఎమ్‌ఎమ్‌ పులి (మంచు మనోజ్‌ పులి అయ్యుండొచ్చు) అని ముద్దుగా పిలుస్తున్నాం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది మంచు లక్ష్మి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మనోజ్, మౌనిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్ దంపతులు తమ బుజ్జి పాపను తీసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మౌనిక, పాప, ధైరవ్ తో కలిసి నేరుగా ఫిలిం నగర్‌లో ఉన్న తన ఇంటికి వచ్చేశారు.

మహాలక్ష్మిని తొలిసారి ఇంట్లోకి తీసుకుపోతున్న శుభ సందర్భాన హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ధైరవ్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. కాగా మంచు మనోజ్, మౌనిక గతేడాది మార్చిలో రెండో వివాహం చేసుకున్నారు. అప్పటికే మౌనికకు ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక కొన్ని నెలల క్రితం మౌనిక గర్భంతో ఉందన్న శుభవార్తను పంచుకున్నాడు మనోజ్. ఆ తర్వాత మౌనిక సీమంతం ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇక ఇప్పుడు పండంటి మహాలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టడంతో మనోజ్, మౌనికల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

bottom of page