top of page
Shiva YT

🌟 రెండో ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా మరాఠా బ్యూటీ శృతి..

🎬 జనతా గ్యారేజ్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఈ మూవీ కావడంతో దేవరను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈసారి వీరిద్దరి కాంబోలో ఎలాంటి మ్యాజిక్ జరగనుందనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రోజు రోజుకీ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ. అలాగే ఈ సినిమాలో తారక్‏ను ఢీకొట్టే ప్రతినాయకుడిగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే. ఇదిలా ఉంటే… తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతోంది.

📰 తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందట. దేవర సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కాబోతుందట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా?.. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన నటి శృతి మరాఠేని మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొరటాల తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో తారక్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. ఇందులో ఓ పాత్ర జోడిగా శృతి కనిపించనుందని టాక్. ఈ విషయం గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే.. బాలీవుడ్, మరాఠీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇద్దరూ తారక్ సరసన కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 🎶✨

bottom of page