top of page

ఈ రోజుల్లో ఆడవారు పెళ్ళికి దూరంగా ఉండడానికి కారణాలేమిటి? 🌟

MediaFx

మ్యారేజ్ అనేది చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం. ఇందులో భార్యాభర్తలిద్దరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా కలిసి ఉండాలి. పెళ్ళి జీవితం సాఫీగా ఉండేందుకు ఇద్దరూ కూడా కృషి చేయాలి. కానీ, ఈరోజుల్లో ఆడవారు కాస్తా ఇండిపెండెంట్‌గా, నచ్చిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకు వీలైనంత వరకూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకుంటున్నారు. దానికి గల కారణాలేంటో తెలుసుకోండి.

బ్యాలెన్స్ చేయలేకపోవడం..

పెళ్ళి కాగానే చాలా బాధ్యతలు పుట్టుకొస్తాయి. కొత్త కుటుంబం, కొత్త ప్లేస్. కెరీర్, కుటుంబం మధ్య బ్యాలెన్సింగ్‌ని కాపాడుకోవడం. ఇవన్నీ చూసి ఆడవారు భయపడుతున్నారు. దీంతో పెళ్ళికి దూరంగా ఉంటుంది.

సపోర్ట్ లేకుండానే..

చాలా మంది ఆడవారు మగవారి అండ లేకుండానే ఒంటరిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆదాయం కూడా బానే వస్తుంది. దీంతో ఫ్రెండ్స్, కొలీగ్స్‌తో చక్కగా స్నేహబంధాన్ని ఏర్పరుచుకుని ఆనందంగా ఉంటున్నారు. దీంతో పెళ్ళి ఎందుకనే భావనవస్తుంది.

పిల్లల్ని ఇష్టపడకపోవడం..

చాలా మంది పెళ్ళైన వెంటనే పిల్లల గురించి అడుగుతారు. కొంతమంది పిల్లలు కావాలని కోరుకుంటారు. కానీ, కొంతమంది ఆడవారు పిల్లల్ని ఇష్టపడరు. దీనిని మగవారు ఇంటి తరపున వారు ఒప్పుకోకపోవచ్చు. దీంతో ఆడవారు పెళ్ళి ఊసేత్తడం లేదు.

కుటుంబ కలహాలు..

చాలా మంది పెళ్ళి తర్వాత అడ్జెస్ట్‌మెంట్‌తోనే బ్రతుకుతున్నారు. దీంతో వారిని చూసి కొంతమంది ఆడవారు ఆలోచించి పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. వైవాహిక జీవితంలో వచ్చే కలహాలకి వారు భయపడుతున్నారు. కాబట్టి, పెళ్ళి అనే ఆలోచన చేయట్లేదు.

ఒత్తిడి..

ఆడవారు ఓ వయసు వచ్చాక వారిపై పెళ్ళి ఎప్పుడనే ప్రశ్నల వర్షం కురుస్తుంది. తెలిసిన వారు, తెలియని వారు ఇలా ప్రతి ఒక్కరూ ఎప్పుడు పెళ్ళి అంటూ అడుగుతూనే ఉంటారు. దీంతో ఓ రకమైన ఒత్తిడికి లోనైన ఆడవారు దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

bottom of page