top of page
MediaFx

పెళ్లైన 5 రోజులకే..తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్..!


ఈ ఏడాది చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కారు. మరికొందరు స్టార్స్ పెళ్లి చేసుకోవడానికి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా పెళ్లి్ చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకున్న వారం రోజులకే ఆమె ఆస్పత్రిలో ప్రత్యక్షమైంది. దీంతో ఆమెకు సంబంధించి రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందని అందుకే ఆస్పత్రిలో టెస్ట్ చేసుకోవడానికి వెళ్లిందంటూ రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీటిలో నిజం ఎంత ఉందంటే..? బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. ‘దబంగ్’ మూవీతో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే రీసెంట్ టైంలో ఈమెకు సరైన హిట్ పడలేదు. ఈ క్రమంలోనే తాను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇండస్ట్రీకే చెందిన జహీర్ ఇక్బాల్ అనే నటుడిని ప్రేమించి.. ఈ మధ్యనే జూన్ 23న పెళ్లి చేసుకుంది. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. పెళ్లయి ఐదురోజులకే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సోనాక్షి-జహీర్ బయటకు వస్తూ కనిపించారు. దీంతో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇది అబద్ధమని తేలింది. శత్రుఘ్ని సిన్హా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌లో ఉన్నారని, తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.

bottom of page