నేరాలకు పాల్పడ్డ నిందుతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాధారణంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ మీడియా సమావేశాలపై పోలీసులు పాటించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.
నేరాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత సాధారణంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ మీడియా సమావేశాలపై పోలీసులు పాటించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. నింబంధల ప్రకారమే.. క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు ప్రెస్ మీట్లో చెప్పాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం తెలింది. క్రిమినల్స్‌పై చేసే విచారణలు పూర్తికాకముందే.. వెల్లడించేటటువంటి అసమగ్ర విషయలు మీడియా విచారణకు అవకాశాలు కల్పిస్తాయని చెప్పింది. అయితే ఇందులో న్యాయ ప్రక్రియను దారి మళ్లించే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది. అంతేకాదు న్యాయమూర్తుల పనితీరుపైన తీవ్రమైన ప్రభావం చూపుతోందని పేర్కొంది. ఇక నిందితులు, బాధితులు, సాక్షుల హక్కులను భంగం కలిగించే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొంది. అందుకోసమే క్రిమినల్ కేసులు వెల్లడించే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.నేరస్తులకు సంబంధించిన వివరాలను మీడియాకు చెప్పే సమయంలో పాటించాల్సిన ప్రామాణిక నిబంధనలను పాటించాలని సూచనలు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను.. మూడు నెలల్లోగా రూపొందించాలని కేంద్ర హోం శాఖకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని రూపకల్పనపై అన్ని రాష్ట్రాల డీజీపీలు నెల రోజల్లోపు సూచనలు చేయాలని తెలిపింది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచనలు చేసింది.