బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఎమోషన్స్ ప్రధానంగా సాగే మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా నిర్మితమవుతోంది.
బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఎమోషన్స్ ప్రధానంగా సాగే మాస్ యాక్షన్ మూవీగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సితార బ్యానర్లో ఇంతవరకూ వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి అని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో హీరో జర్నీ మూడు దశలలో కొనసాగుతుంది. అంటే మూడు కాలాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందన్న మాట. ఆయన జీవితంలోని ఒక్కో దశలో ఒక్కో హీరోయిన్ ఆయనకి తారసపడుతుంది. ఇప్పటికే ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరిని ఎంపిక చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం బాలయ్యతో పాటు ఈ ఇద్దరు బ్యూటీల కాంబినేషన్ లోని సీన్స్ ను 'ఊటి'లో చిత్రీకరిస్తున్నారు. ఇక మరో హీరోయిన్ కోసం వెతికే పనిలో టీమ్ ఉందని అంటున్నారు. ఇప్పుడు రానున్నదే మెయిన్ హీరోయిన్ అని చెబుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోనున్నారని టాక్. ఆ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారనేది చూడాలి మరి.🎥✨