top of page
MediaFx

ఆ సినిమా కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..

ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్ తర్వాత ఎక్కడ చూసినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చారు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా రాబోతుండగా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 250 కోట్ల బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా రూపొందుతుంది, కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లకు చేరుకుంది. అలానే మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

‘గేమ్ ఛేంజర్’ కి సంబంధించి 2 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16 ని ప్రారంభించనున్నాడు. ఇది స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుంది. రామ్ చరణ్ తన పాత్ర కోసం ఆస్ట్రేలియాలో శిక్షణ తీసుకోనున్నాడు. బాడీ బిల్డింగ్ తో పాటు మేకోవర్ కూడా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం 2025 చివరిలో థియేటర్లలోకి రానుంది.

bottom of page