top of page
Suresh D

హిందీలో రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య.. 🎥✨

ఆచార్య సినిమాను ముందుగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తాం అని తెలిపారు. ఆతర్వాత తెలుగు హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ తెలుగులోనే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు హిందీ రిలీజ్ కు ఆచార్య సినిమా రెడీ అయ్యిందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఒక వైపు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే ఇటు ఆచార్య సినిమాలో కూడా పాల్గొన్నాడు. పైగా అప్పటి వరకు కొరటాల శివ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఆయన నుంచి వచ్చిన ఆచార్య పై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ మాత్రం వేరేలా ఉంది. ఆచార్య కథనం కథ డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేశాడు కొరటాల కానీ ప్రేక్షకులను అది ఎక్కలేదు. దాంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

ఆచార్య సినిమాను ముందుగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తాం అని తెలిపారు. ఆతర్వాత తెలుగు హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ తెలుగులోనే రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు హిందీ రిలీజ్ కు ఆచార్య సినిమా రెడీ అయ్యిందని తెలుస్తోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఆచార్య సినిమా రిలీజ్ తర్వాత ఇంతవరకు హిందీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇక ఇప్పుడు ఆచార్య సినిమా హిందీ రిలీజ్ కు రెడీ అవుతుందట. ఆచార్య సినిమాను త్వరలోనే హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఆచార్య సినిమా హిందీ వెర్షన్ లో ఈ జనవరి 11న యూట్యూబ్ ఛానెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ తమ యూట్యూబ్ ఛానెల్లో ఆచార్య సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోపాటలు ఆకట్టుకున్నాయి. మరి తెలుగు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందని ఆచార్య హిందీలో అలరిస్తుందేమో చూడాలి.🎥✨

bottom of page