top of page
Suresh D

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో మెగాస్టార్ భేటీ..🎉🤝

తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సతీసమేతంగా ప్రజాభవన్‌కు వచ్చిన వారిద్దరిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకున్నారు భట్టి.

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అభినందనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులను కలుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే, సీఎం రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపిన మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సతీసమేతంగా ప్రజాభవన్‌కు వచ్చిన వారిద్దరిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకున్నారు భట్టి. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం మెగా దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. చిరంజీవి కూడా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను సన్మానించారు. కశ్మీర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో భట్టిని సత్కరించారు. అలాగే భట్టి విక్రమార్క సైతం చిరంజీవిని శాలువాతో సత్కరించారు.పరస్పర సన్మానాల తర్వాత ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టి సతీమణితోపాటు ఆయన కుమారుడు విక్రమాదిత్య కూడా పాల్గొన్నారు. కుషల ప్రశ్నలతోపాటు పలు విషయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు ఇరువురు.🎉🤝



bottom of page