ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు.
ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి, టాప్ హీరో స్థాయికి ఎదగడం అంటే మాములు విషయం కాదు. ఇలా కేవలం తన స్వయంకృషితో టాలీవుడ్ స్టార్ హీరో అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది అభిమానగణం చిరు సొంతం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఎంతోమందికి ఆయన రోల్ మోడల్. తనదైన డ్యాన్స్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకున్నారాయన. అలాగే సమాజసేవలోనూ చిరు తనవంతు సాయం చేస్తున్నారు. ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. 70 ఏళ్లకు దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీపడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు.
అయితే, తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్‌లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు ఇందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడీ సర్టిఫికేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో మెగాస్టార్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక చిరు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్వకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన సీనియర్ నటి త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తామని ఇప్పటికే మూవీ యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.