top of page
Shiva YT

నంది అవార్డు పేరు మార్పుపై కీలక వ్యాఖ్యలు చేసిన మెగాస్టార్ చిరంజీవి 🌟

కేంద్రప్రభుత్వం తాజాగా పద్మ అవార్డ్స్ ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కు పద్మవిభూషణ్ ప్రకటించింది ప్రభుత్వం.

తాజాగా పద్మ అవార్డ్స్ కు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో దిగజారి మాట్లాడటం సరికాదని అన్నారు చిరంజీవి. వ్యక్తిగత దూషణలు చేసే వారిని ప్రజలే తిరస్కరించాలని సూచించారు. నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సంతోషానిచ్చిందని అన్నారు. తమకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించిన వెంటనే ముందుకు వచ్చి సన్మానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మొదట పద్మ భూషణ్ వచ్చినపుడు చాలా ఆనందం అనిపించింది. పద్మవిభూషణ్ ఇప్పుడు ప్రకటించినపుడు అందరూ అభినదిస్తుంటే అంతకన్నా ఆనందం అనిపిస్తుంది అన్నారు చిరు. 🙏✨

bottom of page