చిరంజీవి స్పీడ్‌కు అసలు రీజన్ అదేనా.?
- Suresh D
- Apr 1, 2024
- 1 min read
చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు.. నిన్నగాక మొన్న మొదలైన విశ్వంభర షూటింగ్ అప్‌డేట్ గురించి తెలిస్తే ఫ్యాన్స్‌కు కూడా షాక్ తప్పదు. అంత వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. మరి చిరంజీవి స్పీడ్‌కు రీజన్ ఏంటి..? అసలు విశ్వంభర షూటింగ్ ముచ్చట్లేంటి..? నెక్ట్స్ చేయబోయే మెగా ప్రాజెక్ట్ ఏంటి..? లైన్‌లో ఏ దర్శకుడున్నాడు..?
ఒకప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే 3 సినిమాలు చేసారు మెగాస్టార్. ఇప్పుడూ అదే చేయాలని చూస్తున్నారు. అందుకే ఓ సినిమా సెట్స్‌పై ఉన్నపుడే.. మరో సినిమాకు సై అనేస్తున్నారు.
తాజాగా విశ్వంభరతో బిజీగా ఉన్న చిరు.. మరో దర్శకుడి కోసం వేచి చూస్తున్నారు. వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్టాఫ్ షూటింగ్ అయిపోయింది. వినడానికి విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. డబుల్ స్పీడ్‌లో ఈ చిత్ర షూట్ జరుగుతుంది.
జూన్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయనున్నారు వశిష్ట. జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీ కానుంది విశ్వంభర. జనవరి 10న సినిమా విడుదల కానుంది. విశ్వంభర సోషియో ఫాంటసీ కావడంతో చిరంజీవితో దర్శకుడికి వర్క్ తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
దాంతో విశ్వంభరతో పాటు మరో సినిమా చేయాలని చూస్తున్నారు మెగాస్టార్. ఆ మధ్య అనిల్ రావిపూడితో చిరంజీవి సినిమా కన్ఫర్మ్ అనుకున్నా.. ఆయన వెంకటేష్ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోయారు. చిరంజీవి తర్వాతి సినిమా హరీష్ శంకర్‌తో ఉండబోతుంది. విశ్వంభర పూర్తయ్యేలోపు.. అక్కడ మిస్టర్ బచ్చన్ షూట్ పూర్తి చేయనున్నారు హరీష్.
అన్నీ కుదిర్తే.. జులై నుంచి చిరు, హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయం. ఇప్పటికే హరీష్ సైతం చిరుకు లైన్ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి రెండు సినిమాలు చేయాలని ఫిక్సైపోయారు మెగాస్టార్.