చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
మొత్తంగా చిరంజీవి కెరీర్‌లో ఖైదీ నుంచి మొదలు పెడితే.. ఇంద్ర వరకు ఎనిమిది ఇండస్ట్రీ మూవీస్ ఉన్నాయి. తన తరంలో ఈ రేంజ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరోగా మెగాస్టార్ రికార్డులకు ఎక్కారు.
ఇంద్ర.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంద్ర సినిమా 2002లో విడుదలై సంచలన విజయం సాధించింది.
ఘరానా మొగుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నగ్మా కథానాయిగా నటించింది. ఘరానా మొగుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
గ్యాంగ్ లీడర్ విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మూవీ చిరు కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి జగదేకవీరుడు అతిలోకసుందరి వైజయంతి మూవీస్ బ్యానర్ పై కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
యముడికి మొగుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా.. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుముడికి మొగుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
పసివాడి ప్రాణం అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఏ.కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ పసివాడి ప్రాణం. ఈ చిత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఖైదీ సంయుక్తా మూవీస్ బ్యానర్ పై ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఖైదీ. హీరోగా చిరు కెరీర్‌ను ఛేంజ్ చేసిన మూవీగా రికార్డులకు ఎక్కింది.మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో దాదాపు 8 సినిమాలు ఇండస్డ్రీ హిట్‌గా నిలిచాయి. ఈ రేంజ్‌లో తన తరంలో ఇన్ని ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరో ఎవరు లేరు.