top of page
MediaFx

ప్రియుడితో మేఘా ఆకాష్ ఎంగేజ్మెంట్..


మేఘా ఆకాష్‏కు యూత్‏లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది ఈ బ్యూటీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కాగా.. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది మేఘా. మొదటి సినిమాతోనే తెలుగు అడియన్స్ కు దగ్గరైంది. కానీ ఆ తర్వాత కథానాయికగా అనుకున్నంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఈ మూవీ తర్వాత మరోసారి నితిన్ సరసన ఛల్ మోహన్ రంగ చిత్రంలో నటించినప్పటికీ ఈ మూవీ కూడా నిరాశపరిచింది. దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడంతో కోలీవుడ్ షిప్ట్ అయ్యింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే టాప్ హీరోయిన్ గా మారింది. అప్పుడప్పుడు తెలుగులో ఒకట్రెండు చిత్రాల్లో మెరిసింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న మేఘా ఆకాష్ రాజా రాజ చోర.. డియర్ మేఘా, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మేఘాకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక ఫోటో షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది ఈ బ్యూటీ.



bottom of page