ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెళ్ల కీలక ప్రకటన..
- MediaFx
- Jul 24, 2024
- 1 min read
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర కార్యక్రమం ప్రారంభమైంది. 10 గంటల వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. అనంతరం ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెడుతూ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తెలపనుంది. అలాగే గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలపై 11:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.