మన ఇండియన్ ఓటిటి నుంచి హిట్ అయిన పలు సాలిడ్ హిట్ సిరీస్ లలో “మిర్జాపూర్” అనే క్రైమ్ యాక్షన్ సిరీస్ కూడా ఒకటి. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ రెండు సీజన్‌లుగా వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఒక్క హిందీలోనే కాకుండా రీజనల్‌గా సౌత్‌లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఈ సిరీస్‌కు ఉన్నారు. ముఖ్యంగా దివ్యేందు శర్మకి అయితే మొదటి సీజన్‌తోనే మంచి క్రేజ్ వచ్చింది. 🎬
ఇక సీజన్ 2కి మరింత క్రేజ్ పెరగడంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు. ఫైనల్‌గా ఇప్పుడు సీజన్ 3 రాబోతోంది. ఇందులో తన పాత్ర లేకపోయినప్పటికీ, లేటెస్ట్‌గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని లెవెల్లో ఉందని చెప్పాలి. మున్నా భయ్యా పాత్ర లేకపోతే సీజన్ 3 చూడము అనుకునేవారికి కూడా చూసే విధంగా ట్రైలర్‌ని కట్ చేశారు. పవర్ కోసం జరుగుతున్న వార్ మరింత సాలిడ్‌గా కనిపిస్తోంది. 💥
అలీ ఫజల్ పోషించిన గుడ్డు పండిట్ రోల్ ఈసారి మరింత పవర్ఫుల్‌గా కనిపించేలా ఉందని చెప్పాలి. ఇంకా ఇషా తల్వార్ పొలిటికల్ పవర్‌తో ఈ గ్యాంగ్ వార్స్ లాంటి వాటికి సమాధానం చెప్పాలని ఇలా పాలిటిక్స్, యాక్షన్ అన్నీ గట్టిగానే ప్లాన్ చేసినట్టుగా ఉంది. 🔥
అంతేకాకుండా వెర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠి ఎంట్రీ తన మిర్జాపూర్ తన సొంతం అన్నట్టుగా ఇచ్చిన ఎండింగ్ ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైట్మెంట్‌ని అందించింది. మొత్తానికి ఈ ట్రైలర్‌తో సాలిడ్ ట్రీట్ ఫ్యాన్స్‌కు రాబోతోంది అని చెప్పాలి. ఈ కంప్లీట్ సీజన్ ఈ జూలై 5న రిలీజ్‌కి తీసుకువస్తున్నారు. 📅