top of page
Suresh D

‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’ తొలిరోజు కలెక్షన్స్..🎥🌟

అనుష్క, నవీన్ పొలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మొత్తం మీద రూ.4 కోట్ల ఆదాయం వచ్చినట్టు శాక్ నిల్క్ అనే వెబ్ సైట్ తెలిపింది.

అనుష్క, నవీన్ పొలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి, మిష్టర్ పొలిశెట్టి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మొత్తం మీద రూ.4 కోట్ల ఆదాయం వచ్చినట్టు శాక్ నిల్క్ అనే వెబ్ సైట్ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని విడుదల చేశారు. తెలుగు థియేటర్లలో ప్రేక్షకుల ఆక్యుపెన్సీ 39 శాతంగా ఉంటే, తమిళంలో 18.16 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అంటే తెలుగుతో పోలిస్తే తమిళ ప్రజల్లో దీనికి ఆదరణ సగమే ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికాలో తొలి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం వసూలైనట్టు స్టూడియో ఫ్లిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. షారూక్ ఖాన్ నటించిన జవాన్ కూడా నిన్ననే విడుదల కావడం తెలిసిందే. అతిపెద్ద సినిమా విడుదల రోజే మిస్ శెట్టిని తీసుకురావడం కూడా కొంత ప్రభావం పడేలా చేసింది. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి సినిమాకు స్పందన మిశ్రమంగా ఉందని ప్రేక్షకుల అభిప్రాయాలను పరిశీలిస్తే తెలుస్తోంది. 🎥🌟


bottom of page