top of page
Suresh D

'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ రివ్యూ..🎥🎞️

అనుష్క శెట్టి సినిమా ఐదేళ్ల తర్వాత వెండితెరపైకి వచ్చింది. థియేటర్లలో 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఈ రోజు విడుదలైంది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రమిది. యువి క్రియేషన్స్ నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉంది.?


'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కథలో మెదడుకు పని కల్పించే పెద్ద కథ ఏమీ లేదు. పెళ్లి కాకుండా తల్లి కావాలని ఓ మహిళ ఏం చేసింది? ఆ క్రమంలో ఆమెకు ఎటువంటి అబ్బాయి పరిచయం అయ్యాడు ? ఆ తర్వాత ఏమైంది? క్లుప్తంగా చెప్పాలంటే... కథ ఇంతే! కానీ, ఆ కథలో కామెడీ, పాటలు, ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరాయి.

పెళ్లి కాకుండా ఓ మహిళ ప్రెగ్నెంట్ కావడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ దర్శకుడు అనుకుంటే... ఆ సీన్లను చాలా విధాలుగా, రకాలుగా తీయవచ్చు. కానీ, మహేష్ బాబు పి ఎక్కడా హద్దు మీరలేదు. గీత దాటలేదు. కుటుంబం అంతా కలిసి చూసే చక్కటి వినోదాన్ని అందించారు. అలాగని, సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆద్యంతం అలరించిందని చెప్పలేం. సినిమా ప్రారంభం సాదాసీదాగా ఉంటుంది. అనుష్క, జయసుధ మధ్య బాండింగ్ & ఆ సీన్లు రొటీన్. హీరో, అతని తండ్రి మధ్య సీన్లలో కూడా కొత్తదనం లేదు. హీరో ఆఫీస్ సీన్లలో కూడా! అయితే, కామెడీ కోటింగ్ కారణంగా సరదాగా సాగుతుంది. పతాక సన్నివేశాల్లో హీరో హీరోయిన్లను కనెక్ట్ చేసిన విధానం, వాళ్ళ నేపథ్యాలను వాడిన తీరు బావుంది. తనలో భయాల గురించి అనుష్క చెప్పే సీన్ కంటతడి పెట్టింస్తుంది.నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. స్టాండప్ కామెడీలో తనకు తిరుగు లేదన్నట్లు కొన్ని సన్నివేశాల్లో విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా స్టాండప్ కామెడీ సీన్లు బావున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు . జీవితంలో ప్రతి ఒక్కరికి భాగస్వామి కావాలని, తోడుగా ఓ మనిషి ఉండాలని సందేశం ఇచ్చే సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. అయితే, మెసేజ్ ఇచ్చినట్లు అనిపించదు. పతాక సన్నివేశాల వరకు కనిపించదు. కేవలం వినోదం మాత్రమే ముందు సీటులో కూర్చుంటుంది. స్క్రీన్ ముందు కూర్చున్న ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎండింగ్ ఎమోషనల్ సీన్లు హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. అసలు కథ, కామెడీ, ఎమోషన్స్ ఇంటర్వెల్ తర్వాతే ఉన్నాయి మీ టికెట్ రేటుకు సరిపడా ఫన్ గ్యారెంటీ. 🎥🎞️

bottom of page