వక్ఫ్ బోర్డులో అక్రమాలు.. ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ అరెస్టు
- MediaFx
- Sep 2, 2024
- 1 min read
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(MLA Amanatullah Khan)ను ఇవాళ ఈడీ అరెస్టు చేసింది. ఇంట్లో సోదాల తర్వాత ఆయన్ను ఆధీనంలోకి తీసుకున్నది. ఆప్ ఎమ్మెల్యే అమానుతుల్లా.. మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన నియామకాల్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. గతంలో వక్ఫ్ బోర్డుకు ఎమ్మెల్యే అమానుతుల్లా ఖాన్ అధినేతగా చేశారు. ఢిల్లీలోని ఓక్లా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఖాన్.. ఇవాళ ఉదయం 630 నిమిషాలకు ట్వీట్ చేశారు. తనను అరెస్టు చేసేందుకు ఈడీ తన నివాసానికి వచ్చినట్లు ఆయన ఆరోపించారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఖాన్ ఇంటికి వెళ్లినట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఇదే కేసులో ఎమ్మెల్యేకు సమన్లు ఇచ్చి 13 గంటల పాటు విచారించారు.