top of page
Shiva YT

మూడు వేలకు చేరువలో మొరాకో మృతుల సంఖ్య 😢

మొరాకోలో భూకంపం వచ్చి ఇప్పటికీ 72 గంటలు దాటిపోయింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాల చిక్కుకున్నటువంటి బాధితులు ప్రాణాలతో బయటకు వస్తారన్న ఆశలు సన్నగిల్లిపోవడం కంటతడిపెట్టిస్తున్నాయి.

ముఖ్యంగా భూకంప కేంద్ర ప్రాంతమైనటువంటి అట్లాస్ పర్వత ప్రాంతంలోని మూరుమూలన ఉన్న గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 😥 ఎక్కడ చూసిన కూడా గుట్టలుగుట్టలుగా శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. 😢 అయితే కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 😓 వీటి ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. 😞 దీనివల్ల సహాయక బృందాలకు అక్కడికి చేరుకునేందుకు కూడా అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయి. 😓 మరికొన్ని ప్రాంతాల్లో శిథిలాల వెలికితీత పనులు ఇప్పటిదాకా చేపట్టలేదు. 😔 దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 😞

ఇదిలా ఉండగా.. గత శుక్రవారం రోజున అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్ అనే పర్యాటక ప్రాంతానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లాస్ పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. 😱 దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఈ భూకంపం దాటికి ప్రభావితమై ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 🙏🏼

bottom of page