top of page
Shiva YT

బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్..

బడా హీరోయిన్లు పెద్ద పెద్ద ఈవెంట్లలో లేదా ఎయిర్‌పోర్టుల్లో లేదా సెలబ్రిటీల ఇళ్లలో ఏవైనా ఫంక్షన్స్ ఉంటే కనిపించడం మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో వారికి చాలామంది రక్షణగా ఉంటారు. వారు ఏదైనా టెంపుల్‌కి వెళ్లినా అక్కడ కూడా వీఐపీ ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ విరామ సమయంలో వెళ్లి దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్.. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి చాలా సాధాసీదాగా వెళ్లారు. ఆమె ఎవరో కాదు.. సీతారామం హీరోయిన్.. మృణాల్ ఠాకూర్. తొలుత ఆమెను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఫోటోలు కోసం ఎగబడ్డారు. పూజల అనంతరం అడిగిన అందరికీ ఫోటోలు ఇచ్చారు మృణాల్. గుడిలోని పూజారి మృణాల్‌కు ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చారు. త్వరలో విడుదలవుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అవ్వాలని దీవించండి అని మృణాల్ కోరడంతో.. ఆయన కూడా అలాగే దీవించారు.



bottom of page