top of page
MediaFx

సొంత మైదానంలో హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై..⚡🏏


పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం చాలా దారుణంగా ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఆ జట్టు తన గత నాలుగు మ్యాచ్‌లలో వరుస పరాజయాలను చవిచూసింది. ఇప్పుడు పరువు కోసం గెలవాలని కోరుకుంటుంది. బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణించలేకపోవడం, బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా ఎటువంటి మద్దతు పొందలేకపోవడం ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో కనిపించిన రెండు అతిపెద్ద లోపాలుగా మారాయి.

మరోవైపు, పాయింట్ల పట్టికలో, SRH 10 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తుఫాన్ బ్యాటింగ్ శైలితో ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు భయాన్ని కలిగించింది. కానీ, మధ్యలో కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే, తమ చివరి మ్యాచ్‌లో ఆ జట్టు చివరి బంతికి రాజస్థాన్ రాయల్స్ వంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ మునుపటిలా తన బ్యాట్స్‌మెన్స్ నుంచి వేగంగా, భారీ ఇన్నింగ్స్‌లను ఆశిస్తుంది. అదే సమయంలో, బౌలింగ్ విభాగం ఇప్పటివరకు చాలా మంచి పని చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ జట్టు మరో విజయంతో ప్లేఆఫ్‌కు చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది.


bottom of page