top of page

మున్సిపల్‌ కార్మికులను వరించిన అదృష్టం.. 💭🎟️

అందరూ కలిసి డబ్బులు పోగేసి రూ.250 విలువ చేసే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వారిలో తొమ్మిది మంది తలో రూ.25 ఇచ్చారు. మరో ఇద్దరు రూ12.50 వేసుకుని..రూ.250తో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశారు.

కేరళకు చెందిన పదకొండు మంది మహిళ కార్మికులకు లాటరీ రూపంలో అదృష్టం వరించింది. మలప్పురం పరిధిలోని పరప్పనంగడి మున్సిపాలిటీ కి చెందిన హరిత కర్మ సేనకు చెందిన కొందరు పేద మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌‌కు తరలిస్తుంటారు. అలా వచ్చే ఆ కొద్ది పాటి ఆదాయమే వారికి జీవనాధారం. ఈ క్రమంలోనే వారు లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని మార్చుకోవాలనుకున్నారు. కానీ, లాటరీ టికెట్ కొనుగోలు చేసే స్తోమత కూడా వారికి లేకపోవడంతో..అందరూ కలిసి డబ్బులు పోగేసి రూ.250 విలువ చేసే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. వారిలో తొమ్మిది మంది తలో రూ.25 ఇచ్చారు. మరో ఇద్దరు రూ12.50 వేసుకుని..రూ.250తో లాటరీ టికెట్‌ కొనుగోలు చేశారు.అలా మున్సిపల్‌ కార్మికులైన మహిళలంతా కలిసి డబ్బులు పోగేసి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు వారు నిర్వహించిన డ్రాలో రూ.10 కోట్ల విలువ చేసే మాన్‌సూన్ బంపర్ లాటరీ తగిలింది.🎲💸


 
 
bottom of page