ప్రపంచమంతా ఇప్పుడు పుష్ప సినిమా ఫీవర్ పట్టుకుంది. విదేశాల్లో కూడా పుష్ప పాటల జోరు హోరెత్తుతోంది. పలువురు పుష్ప సినిమా పాటలకు డ్యాన్సులు వేసి అదరగొడుతున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీవల్లి పాటకు ఓ యువతి హూక్ స్టెప్ వేసి అదగొట్టేసింది.
షాపింగ్ చేస్తున్న ఓ యువతి.. షాపింగ్ చేసిన తర్వాత బట్టలన్నింటినీ ఓ బ్యాగ్‌లో వేసుకొని భుజానికి బ్యాగ్ తగిలించుకుంటుంది. అయితే.. ఆ బ్యాగ్ బరువుగా ఉండటంతో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ డ్యాన్స్ వేసినట్టుగా వేసి అదరగొట్టేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. షాపింగ్ చేయడం ఓకే కానీ.. షాపింగ్ చేసిన తర్వాత వాటిని మోయడం కష్టమే సుమీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.