సమ్మర్ సీజన్ దాదాపు ముగిసింది. అయితే థియేటర్లలోకి పెద్ద సినిమాలు మాత్రం రావడం లేదు. బహుశా వచ్చే వారం ప్రభాస్ కల్కితో పెద్ద సినిమాల సందడి మొదలు కావచ్చేమో. ఈ వారం వరుణ్ సందేశ్ నింద, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, ఓ మంచి ఘోస్ట్, సీతా కల్యాణ వైభోగమే, ప్రభుత్వ జూనియర్ కళాశాల తదితర సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే 20కు పైగా సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం అరణ్మనై 4. తెలుగులో బాకుగా రిలీజైంది. ఇందులో తమన్నా, రాశీఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే నడికల్ తిలకం, మహారాజ్ సినిమాలు, హౌస్ ఆఫ్ డ్రాగన్ రెండో సీజన్ కాస్త ఆసక్తిని రేపుతున్నాయి. వీటితో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి జూన్ 3 వారంలో వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల లిస్ట్ ఏంటో చూద్దాం రండి.
నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సినిమాలు, సిరీస్ లివే..
ఏజెంట్స్ ఆఫ్ మిస్టరీ (కొరియన్ వెబ్ సిరీస్) – జూన్ 18
ఔట్ స్టాండింగ్: ఏ కామెడీ రివల్యూ షన్ (ఇంగ్లిష్ మూవీ) – జూన్ 18
లవ్ ఈజ్ బ్లైం డ్ బ్రెజిల్ సీజన్ 4 (పోర్చుగీస్ వెబ్ సిరీస్) – జూన్ 19
మహారాజ్ (హిందీ సినిమా) – జూన్ 19
అమెరికన్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 2
కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 20
గ్యాంగ్స్ ఆఫ్ గలీషియా(స్పానిష్ వెబ్ సిరీస్) – జూన్ 21
నడికర్ తిలకం (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూన్ 21
ద విక్టిమ్స్ గేమ్ సీజన్ 2 (మాండరిన్ వెబ్ సిరీస్) – జూన్ 21
ట్రిగ్గర్ వార్నిం గ్ (ఇంగ్లిష్ సినిమా) – జూన్ 21
రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ వెబ్ సిరీస్) – జూన్ 22
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
బాక్ (తెలుగు డబ్బింగ్ సినిమా ) – జూన్ 21
బ్యాడ్ కాప్ (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 21
ద బేర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జూన్ 21
ఆహా
సీరగన్ (తమిళ సినిమా) – జూన్ 18
అమెజాన్ మినీ టీవీ
ఇండస్ట్రీ (హిందీ వెబ్ సిరీస్) – జూన్ 19
జియో సినిమా
హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 2 (తెలుగు డబ్బిం గ్ సిరీస్) – జూన్ 17 బిగ్ బాస్ ఓటీటీ (హిందీ రియాలిటీ షో) – జూన్ 21
బుక్ మై షో:
లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్ (ఇటాలియన్ సినిమా) – జూన్ 21