లైఫ్‌లో తోడు అనేది అవసరం! అందుకే తనను వదిలి పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్లిన తన పార్టనర్‌ను జ్ఙాపకాలను పక్కకు పెట్టి మరీ కొంత మంది వెంటనే మరో తోడు వెతుక్కుంటారు.
కానీ తన కోసం అలా చేయకుండా తన ఆలనాపాలనాలోనే ఇంతకాలం బిజీగా ఉన్న తన అమ్మ సురేఖా వాణికి.. త్వరలో పెళ్లి చేస్తా అంటున్నారు ఆమె కూతురు సుప్రిత. ఇక రీసెంట్గా ఓ షోకు వెళ్లిన సుప్రీత .. తన తల్లికి రెండో పెళ్లి చేస్తా అంటూ చెప్పింది. అందుకోసం ప్రయత్నిస్తున్నా అంది. అంతేకాదు తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు రెడీగా లేరని.. అంకుల్స్ అయితే తన తల్లికి కరెక్టుగా సెట్ అవుతారని కూడా ఫన్నీగా కామెంట్స్ చేసింది. తన తల్లిని పెళ్లి చేసుకోవడానికి అంకుల్స్ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతారని.. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బాగా చూసుకోవాలని, టాక్సిక్ గా అస్సలే ఉండకూడదని చెప్పుకొచ్చింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే తన తల్లికి పెళ్లి చేస్తా అని తెలిపింది సుప్రీత.. అలాగే తన గురించి చెప్తూ.. గతంలో ఓ అబ్బాయిని ప్రేమించానని కానీ అతను చాలా టార్చర్ చేశాడని తెలిపింది.